NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎయిర్ టెల్ లో.. గూగుల్ పెట్టుబ‌డులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ దేశీయ ప్రైవేట్ టెలికం కంపెనీ ఎయిర్ టెల్ లో గూగూల్ భారీ పెట్టుబ‌డులు పెట్టే ప్రయ‌త్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు కంపెనీల మ‌ధ్య గ‌త ఏడాది నుంచి చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఈ చ‌ర్చ‌లు ప్రస్తుతం చివ‌రి ద‌శ‌లో ఉన్నట్టు ఓ ఇంగ్లీష్ ప‌త్రిక క‌థ‌నంలో పేర్కొన్నారు. గ‌త ఏడాది గూగుల్ రిల‌య‌న్స్ జియోలో 34,000 కోట్ల పెట్టుబ‌డి పెట్టింది. గూగుల్ , జియో సంయుక్తంగా డెవ‌ల‌ప్ చేసిన అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ త్వర‌లో మార్కెట్లోకి రానుంది. జియో ప్రధాన పోటీదారు సంస్థ ఎయిర్ టెల్ లో గూగుల్ పెట్టుబడులు పెడుతుంద‌న్న వార్త ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎయిర్ టెల్ రుణ‌భారం త‌గ్గించుకోవ‌డంతో పాటు.. 4జీ, 5జీ టెక్నాల‌జీ అభివృద్ధికి గూగుల్ భాగ‌స్వామ్యం ఎయిర్ టెల్ కంపెనీకి కలిసొస్తుంది.

About Author