వీటి ధరలు భారీగా పెరిగాయి.. అయినా కొనేవారు తగ్గడం లేదు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఖరీదైన ఇళ్లు, కార్లు, బంగారం, ఇతర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. 2010 ధరలతో పోలిస్తే ఇప్పుడు వీటి ధరలు భారీగా ఉన్నాయి. కరోన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ.. ఇళ్లు, కార్లు, లగ్జరీ వస్తుల ధరలు వాయువేగంతో దూసుకుపోతున్నాయి. కరోన కారణంగా ఎందరో నిరుద్యోగులుగా మారారు. వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడ రియల్ ఎస్టేట్, వాహనరంగం, ఇతర లగ్జరీ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2010లో ఒక లగ్జరీ వస్తువు ధర 1000 రూపాయలు ఉంది. ప్రస్తుతం ఆ వస్తువు ధర 1900 ఉంది. దాదాపు 90 శాతం పెరిగింది. సంక్షోభ సమయాల్లో కూడ దేశంలో కొన్ని వర్గాల సంపద పెరుగుతోంది. దీని వల్ల లగ్జరీ వస్తువుల రంగం కూడ పురోగమిస్తోంది. వివిధ సంస్థల గణాంకాల ప్రకారం రియల్ ఎస్టేట్ లో వివిధ నగరాల్లో ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. కార్ల ధరలు, సెల్ ఫోన్ల ధరలు, బంగారం ధరలు భారీగా పెరిగాయి.