రక్తపోటును ఇలా అదుపులోకి తీసుకురావొచ్చు !
1 min readపల్లెవెలుగు వెబ్ : రక్తపోటును క్రమబద్ధీకరించడంలో కొన్ని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ పోషకాలు లభించే ఆహార పదార్థాలను మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వార రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు.
- పొటాషియం గుండెలోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని క్రమబద్ధీకరిస్తుంది. పొటాషియం లోపం కారణంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉందని ప్రయోగాల్లో రుజువైంది. బంగాళదుంపలు, అరటిపళ్లు, చిక్కుళ్లు, పాలకూర, మష్రూమ్స్ లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.
- రక్తపోటు పెరుగుదలకు మెగ్నీషియం లోపం కూడ ఒక కారణం. ఇందుకు అధిక బరువుతో సంబంధంలేదు. బాదం, జీడిపప్పు, పాలకూరల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవాలి.
- గుండె ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫ్యాట్ .. ఒమెగా -3 ఫ్యాట్. ఈ కొవ్వు కలిగి ఉండే ఫిష్ ఆయిల్స్ ఈ పోషకం లోపం కారణంగా పెరిగే రక్తపోటును అదుపులోకి తీసుకురావొచ్చు.