ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా.. సీపీఎస్ రద్దు చేయాల్సిందే..
1 min read– హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి … అధికారంలోకి వచ్చి 120 వారాలు అయినా రద్దు చేయకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో APCPSEA ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవా లన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (5వ తేదీ) కానుకగా సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. అప్పుడు ఉద్యోగులు పెన్షన్ విద్రోహ సభ బదులు… పెన్షన్ పండగ సభ నిర్వహిస్తామన్నారు. సీపీఎస్ రద్దు అయ్యేంత వరకు APCPSEA నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టైగర్ కేశవ, జిల్లా ప్రధాన కార్యదర్శి దిన్నె విశ్వేశ్వప్ప, కార్యదర్శులు శ్రీనివాస రెడ్డి, నాగశేషులు, నాగునాయక్, గారు పాల్గొన్నారు.