లాభాల్లో ముగిసిన సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ మరోసారి ఆల్ టైం హైని తాకింది. ఉదయం స్వల్ప నష్టాల్లోకి జారుకుని.. ఆ తర్వాత లాభాల్లో కదిలాయి. ఆటో, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ స్టాక్స్ తప్ప మిగిలిన సెక్టార్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 514 పాయింట్ల లాభంతో 57,852 స్థాయి వద్ద, నిప్టీ 157 పాయింట్ల లాభంతో 17,233 స్థాయి వద్ద, బ్యాంక్ నిప్టీ 300 పాయింట్ల లాభంతో 36,874 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగిసింది.