అభివృద్ధి కి నడకలు నేర్పిన నేత వైఎస్ఆర్ : ఎంఎల్ సి జకీయా ఖానం
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: అభివృద్ధికి నడకలు నేర్పిన నేత దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ అని ఎం ఎల్ సి జకీయా ఖానం పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని వై ఎస్ ఆర్ సి పి కార్యాలయంలో వై ఎస్ ఆర్ 12 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వై ఎస్ ఆర్ సిపి కార్యాలయం,ఆర్ టి సి బస్ స్టాండ్ సర్కిల్ లోని వై ఎస్ ఆర్ విగ్రహాలకు మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి ఎం ఎల్ సి జకీయా ఖానం, వైఎస్ఆర్ సిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎం ఎల్ సి జకీయా ఖానం మాట్లాడుతూ వై ఎస్ ఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రదాత అని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, అర్హులందరికీ ఇళ్ళు, ఉచిత విద్యుత్, రుణ మాపీ, ఫీజు రీయంబర్స్మెంట్ తదితర ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రం లోని సాగునీటి నీటి ప్రాజెక్ట్ లతో పాటు మన ప్రాంతం లోని వెలిగల్లు, జరికోన, శ్రీనివాస పురం ప్రాజెక్ట్ లను నిర్మించిన ఘనత దివంగత మహానేత వై ఎస్ ఆర్ కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా,వైస్ చైర్మన్ విజయభాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్,అఖిల భారత వెనుక బడిన వర్గాల ఫోరమ్ కన్వీనర్ వండాడి వెంకటేశ్వర్లు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ ల సంఘ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కౌన్సిలర్లు కొలిమి ఛాన్ బాషా, ఆసీఫ్ అలీఖాన్, జాకీర్, వెంకట్రామిరెడ్డి,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, పల్లా రమేష్, జానం రవీంద్ర యాదవ్,గువ్వల బుజ్జిబాబు, రియాజ్, ఇర్ఫాన్, జాఫర్ అలీఖాన్, మాజీ జెడ్ పి కో అప్షన్ సభ్యుడు హసన్ బాషా,కో అప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి, ఆసీఫుల్లా ఖాన్, ఖాదర్ వలీ, కొత్తిమీర ప్రసాద్, జావీద్, అమీర్ , రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.