8 నెలల పసికందుకు హెచ్ ఐవీ రక్తం ఎక్కించారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : మహారాష్ట్రలో దిగ్బ్రాంతికర సంఘటన జరిగింది. ఓ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చేసిన తప్పిదం.. 8 నెలల చిన్నారి పాలిట శాపంగా మారింది. అకోలా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. చిన్నారికి తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో.. రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. అకోలాలోని ఓ బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించిన రక్తాన్ని ఎక్కించారు. ఆ తర్వాత చిన్నారి అనారోగ్యం నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి తరచూ అనారోగ్యం బారినపడుతూ వచ్చారు. దీంతో అమరావతిలోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. పాపకు వేరే లక్షణాలు ఉండటం గమనించిన వైద్యులు హెచ్ఐవీ పరీక్షలు చేయించారు. పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించగా.. వారికి నెగిటివ్ వచ్చింది. వైద్యులను ఆరా తీయగా రక్తం ఎక్కించిన విషయం తెలిసింది. దాతల నుంచి రక్తం స్వీకరించే ముందు తప్పనిసరిగా హైచ్ఐవీ పరీక్ష చేయాలన్న నిబంధన ఉందని, పాపకు రక్తం ఎలా ఎక్కించారన్న విషయం తేలాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.