కొత్త గరిష్టాల వద్ద క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్టాల వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ , నిఫ్టీలు మరోసారి ఆల్ టైం హైని నమోదు చేశాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 37000 స్థాయి వద్ద బలమైన రెసిస్టెన్స్ ఎదుర్కొంది. ఒకానొక దశలో ఇన్వెస్టర్లు భారీ లాభాల స్వీకరణకు దిగారు. ఈ నేపథ్యంలో సూచీలు కొంత ప్లాట్ గా కూడ కదిలాయి. రిలయన్స్, ఆటో, మెటల్ స్టాక్స్ ఈ ర్యాలీకి దోహదం చేశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 58,129 స్థాయి వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17,323 స్థాయి వద్ద, బ్యాంక్ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 36761 స్థాయి వద్ద క్లోజ్ అయ్యాయి.