అప్ఘాన్ సుప్రీం లీడర్ ఈయనే !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆప్ఘన్ సుప్రీం లీడర్ గా ముల్లా హైబతుల్లా అఖుంద్ జాదాను ఎంపిక చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు పై అధికారిక ప్రకటన చేయనున్నారు. దేశ అత్యున్నత నాయకుడిగా అఖుంద్ జాదా అవుతారని, ఆ విషయంలో మరో ప్రశ్నకు తావు లేదని తాలిబన్లు ప్రకటించారు. మంత్రి వర్గ ఏర్పాటు పై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ప్రభుత్వంలో ప్రావిన్సులకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఉంటారని, వీరి నేతృత్వంలో స్థానిక పాలన సాగుతుందని ప్రకటించారు. పోలీస్ చీఫ్, పోలీసులను ఇప్పటికే తాలిబన్లు నియమించారు. కాందహార్ నుంచే అఖుంద్ జాదా తన పాలన కొనసాగిస్తారు. సుప్రీం లీడర్ దేశ అధ్యక్షుడి కంటే అత్యన్నతమైన పదవి. రాజకీయ, సైనిక, మతపరమైన నిర్ణయాల్లో సుప్రీం లీడర్ మాటే శాసనం. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో తాము సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్టు తాలిబన్లు తెలిపారు.