మొబైల్ పోయినా.. మీ డబ్బు సేఫ్ గా ఉండాలంటే ఇలా చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ : సెల్ ఫోన్ దొంగతనం చేశాక దొంగలు వాటిని వేరే వారికి అమ్మేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రూట్ కూడ మార్చారు. సెల్ ఫోన్ దొంగతనం చేశాక అందులోని బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగలించి.. బ్యాంక్ అకౌంట్లలో డబ్బు తస్కరించడం ఇప్పుడు కొత్త పద్ధతి. ఇలా దొంగతనం జరిగినా.. మీ ఫోన్ నుంచి సమాచారం బయటికి వెళ్లకూడదంటే ఇలా చేయండి.
- మొదట సిమ్ బ్లాక్ చేయాలి
- ఫలితంగా ఎలాంటి ఓటీపీ మెసేజ్లు మీ నెంబర్ కు రావు.
- ఫోన్ పోయిన వెంటనే మీ బ్యాంక్ కు ఫోన్ చేసి.. ఆన్ లైన్ సర్వీస్లు ఆపేయమని చెప్పిండి.
- బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన నెంబర్ మార్చుకోండి. అదే నెంబర్ తో బ్యాంక్ లావాదేవీలు చేయవద్దు.
- పాస్ వర్డ్ రీసెట్ చేసుకున్నాకే మీ నెంబర్ ఉపయోగించండి.
- ఆధార్ సెంటర్లో కూడ మీ పోయిన ఫోన్ నెంబర్ ను మార్చాలి. కొత్త నెంబర్ అప్ డేట్ చేయించుకోవాలి.
- ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు నిలిపేసుకున్న వెంటనే.. యూపీఐ దాంతో పాటు లింక్ అయిన ఇతర వాలెట్లను డీయాక్టివేట్ చేసుకోవాలి.
- పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే సర్వీసులు రద్దు చేసుకోవాలి. లేదంటే వాటి హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసి.. వాటిని బ్లాక్ చేసుకోవాలి.
- మీ పోయిన ఫోన్ నెంబర్ కు లింక్ అయిన సోషల్ మీడియా అకౌంట్లు డీ యాక్టివేట్ చేసుకోవాలి.
- వెంటనే మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. మీ ఎఫ్ఐఆర్ కాపీతో బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీ పనులు ఇంకా సులువుగా జరుగుతాయి. మీ సొమ్ము దొంగలించబడితే సాక్ష్యంగా ఆ ఎఫ్ ఐఆర్ ఉపయోగించవచ్చు.