7 గంటల్లో 101 ఆపరేషన్లు.. విచారణకు ఆదేశం !
1 min readపల్లెవెలుగు వెబ్: ఓ వైద్యుడు సంచలనం సృష్టించాడు. 7 గంటల్లో నిర్విరామంగా 101 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాడు. చత్తీస్ఘడ్ లోని సుర్గుజా జిల్లా నర్మదాపూర్ ఆరోగ్యం కేంద్రంలో ఆగస్టు 27 మెగా స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. నిబంధన ప్రకారం ఒక వైద్యుడు రోజుకు 30 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేయాలి. కానీ ఈ క్యాంప్ లో సదరు డాక్టరు ఏడు గంటల్లో 101 ఆపరేషన్లు చేశాడు. దీంతో అతడి నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అన్ని ఆపరేషన్లు చేస్తారా అంటూ ఆ డాక్టరు పై పలువురి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించింది.