PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: సీఐటీయూ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఉపాధి పనులు లేక భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుని వీధిన పడుతున్నాయని వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి షేక్ మొహమ్మద్ షరీఫ్ . అంతేకాక భవన నిర్మాణ కార్మికులకు నిలిపేసిన సంక్షేమ పథకాలను మళ్లీ పనరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం కర్నూలు పాతబస్తీలోని, మాసుం భాష దర్గా ప్రాంతంలో గొరభాయి అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన మొహమ్మద్ షరీఫ్, అబ్దుల్ దేశాయ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఇసుక లేక ఉపాధి కోల్పోయిన కార్మికులు దాదాపు 150 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించకపోగా…. నష్టపరిహారం ఇవ్వకుండా సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి మోసం చేస్తున్నాడని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న కలెక్టరేట్​ ముందు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహమ్మద్ హుస్సేన్ ,సలీం భాష ,మహబూబ్, శాలి బాషా, హుస్సేన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author