పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..
1 min read– ఐసీడీఎస్ సూపర్ వైజర్ నర్సమ్మ
పల్లెవెలుగు, గోనెగండ్ల: బాలింతలు, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు ఐసీడీఎస్ సూపర్ వైజర్ నర్సమ్మ. పౌష్టికాహార మాసోత్సవాలు పురస్కరించుకొని బుధవారం గోనెగండ్ల మండలపరిధిలోని చిన్ననెలటూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ తన్వీర్, డీఈఓ జయన్న మాట్లాడుతూ కోవిడ్ 19,కరోనా వ్యాక్షిన్ పై అవగాహన కల్పించారు.
అనంతరం ఐ సి డి ఎస్ సూపర్వైజర్ నరసమ్మ మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడు కోవచ్చన్నారు. ముఖ్యంగా రక్తహీనత వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు అన్నారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం గురించి చిన్నారుల తల్లులకు వివరించారు. పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సాలమ్మ, లింగమ్మ,గోవిందమ్మ,షర్మిల, భాగ్యలక్ష్మి, సుజాత,104 సిబ్బంది,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.