NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ అండ‌తోనే ప్రైవేటీక‌ర‌ణ

1 min read

– విశాఖ మాజీ ఎంపీ సబ్బంహరి
ముఖ్యమంత్రి జ‌గ‌న్ అండ‌తోనే విశాఖ ఉక్కు ప‌రిశ్రమ ప్రైవేటీక‌రిస్తున్నార‌ని ఆరోపించారు విశాఖ మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ నేప‌థ్యంలో స‌బ్బం హ‌రి విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ జ‌గ‌న్ తో మాట్లాడాకే .. కేంద్రం ముందుకు వెళ్తోంద‌ని ఆరోపించారు. జ‌గ‌న్ , విజ‌యసాయిరెడ్డిలు డ్రామాలు ఆడుతున్నార‌ని విమర్శించారు. విశాఖ ఉక్కు కోసం జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఎందుకు అణ‌చివేస్తున్నార‌ని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే.. ఉద్యమంలో పాల్గొనాల‌ని సూచించారు. పోస్కో ప్రతినిధులు విశాఖ‌కు రావాలంటే.. ఉద్యమాల‌ను అణచివేయాల‌ని, అందుకు ఒక‌వైపు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తున్నట్టు నాట‌కాలు ఆడుతూ.. మ‌రోవైపు ఉద్యమాన్ని అణ‌చివేస్తున్నారని తెలిపారు.

About Author