‘పెండింగ్’ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు బీసీ, ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి. రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ గురువారం విజయవాడ, తాడేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జి.వి.రఘు రామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, షేక్ రియాజ్‌తోపాటు బనగానపల్లె అధ్యక్షుడు రామకృష్ణుడు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ధ్రవీకరణ పత్రాలు ఇవ్వడంలేదని, దీంతో విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజురీయంబర్స్‌మెంట్ విడుదల చేయడంతోపాటు సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు స్పందించిన సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జి.వి.రఘురామ్ … నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సురేష్ తదితరులు పాల్గొన్నారు.