PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రూ ఆఫ్​ పేరుతో.. ప్రజలపై భారం: సీపీఐ

1 min read

– విద్యుత్ చార్జీలు తగ్గించాలని రస్తారోకో
పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: ట్రూ ఆఫ్​ చార్జి పేరుతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్​ చార్జిలు పెంచడం అన్యాయమని, వెంటనే చార్జిలు తగ్గించాలని డిమాండ్​ చేశారు సీపీఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్ర, మండల కార్యదర్శి విరుపాక్షి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం ఆస్పరి విద్యుత్​ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పై అదనపు భారం ఒక యూనిట్ కి ఒక రూపాయి 23 పైసలు వసూలు చేస్తోందని, ఈ అదనపు ఛార్జి ట్రూ ఆఫ్ చార్జీ లను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ ఏఈ కి అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, శివన్న, కృష్ణ , నాగరాజు, రంగన్న, ఆంజనేయ, రాముడు, ఏఐవైఎఫ్ నాయకులు హనుమంతు, రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

About Author