వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు.. ఆయన కుక్కను చంపారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. సింహాద్రిపురం మండలం సుకేసుల వాసి ఉమాశంకర్ రెడ్డిని విచారించిన సీబీఐ.. అనంతరం కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పేర్కొంది. రిమాండ్ రిపోర్టులోని అంశాల ప్రకారం వివేకా హత్యకేసులో సునీల్, ఉమాశంకర్ రెడ్డి పాత్ర పై ఆధారాలు ఉన్నాయి. హత్యకేసులో ఇద్దరి కుట్రకోణం ఉంది. ఉమాశంకర్ పాత్రపై సునీల్ విచారణలో చెప్పారు. దస్తగిరి వాంగ్మూలంలో ఉమాశంకర్ పాత్ర ఉందని చెప్పాడు. వివేకా హత్యకు ముందే ఆయన ఇంట్లోని కుక్కను చంపారు. సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో కుక్కను ఢీకొట్టి చంపారు. హత్య చేయడానికి సునీల్, ఉమాశంకర్ బైక్ పై వెళ్లారు. ఉమా శంకర్ర బైక్ లో గొడ్డలి పెట్టుకొని పారిపోయాడు. బైక్ , గొడ్డలి స్వాధీనం చేసుకున్నాం. గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదిక తెప్పించాం. గత నెల 11న ఉమాశంకర్ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నాం. మరికొందరు నిందితుల్ని పట్టుకోవాల్సి ఉంది. మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలి. ఉమాశంకర్ రెడ్డిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలి
అని సీబీఐ పిటిషన్ లో పేర్కొంది.