‘ఎర్రచీమల చట్నీ’ .. కరోనా మందుగా వాడాలని కోర్టుకెక్కారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన నివారణకు ఎర్రచీమల చట్నీ ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ పిటిషనర్ కోర్టుకెక్కారు. దీంతో ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఆసక్తికరంగా స్పందించింది. సంప్రదాయ జ్ఞానం, ఇంటి చిట్కాలను కరోన నివారణలో ఉపయోగించమని ఆదేశించలేమని తేల్చింది. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి చిట్కాలను ఎవరికి వారు సొంతంగా వాడొచ్చని, అందర్ని వాడాలని చెప్పలేమని స్పష్టం చేసింది. సొంతంగా చిట్కా వాడితే.. వాడినే వారే దాని పర్యావసనాన్ని అనుభవించాలని చెప్పింది. దీనిని అందర్నీ ఆచరించమని చెప్పలేమని స్పష్టం చేసింది. ఎర్ర చీమలు, పచ్చి మిరపకాయలు కలిపి చట్నీగా తయారుచేస్తారు. ఒరిస్సా, చత్తీస్ఘడ్ తోపాటు పలు రాష్ట్రాల గిరిజనులు దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. దగ్గు, సాధారణ జలుబు, ఆయాసం, శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.