ప్రభుత్వ పోర్టల్ ద్వార సినిమా టికెట్ బుకింగ్స్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : సినిమా టికెట్లు గతంలో థియేటర్ల దగ్గర క్యూ లైన్లలో నిల్చుకుని తీసుకునేవారు. ఆ తర్వాత టెక్నాలజీ అందిపుచ్చుకుని వెబ్ సైట్లు, యాప్ ల ద్వార టికెట్లు అమ్ముతున్నారు. అయితే.. సినిమా టికెట్ ధరలు ప్రాంతాన్ని , సినిమాని, థియేటర్ని బట్టీ అమ్ముతున్నారు. దీంతో సగటు ప్రేక్షకుడు ఇబ్బందిపడుతున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం.. టికెట్ల అమ్మకాల పై దృష్టిసారించింది. ఇందుకోసం ప్రభుత్వ వెబ్ సైట్ ను ప్రారంభించబోతోంది. రైల్వే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ తరహాలో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వార ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మనున్నారు. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ థియేటర్, టెలివిజన్, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, అభివృద్ధి, అమలు ప్రకృయను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది.