PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్థానికంగా.. నేడు ప్రభుత్వ సెలవు

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​, జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​, జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్​

– కలెక్టర్​, జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు, కర్నూలు
అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 10న పోలింగ్ నిర్వహించే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూర్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలో స్థానికంగా ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, 1881 ప్రకారం అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్ జరిగే మున్సిపల్ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 10వ తేదీన స్థానికంగా ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

About Author