వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వం !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా నేపథ్యం ఉన్నవారికి పార్టీ టికెట్ ఇవ్వబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. మాజీ గ్యాంగ్ స్టార్ మఖ్తర్ అన్సారీకి మరోసారి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మఖ్తర్ అన్సారీ స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీం రాజ్ భర్ ను పోటీలో దించుతామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో వారి మాఫీయా నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ ఇంచార్జీలకు ఆమె సూచించింది. మఖ్తర్ అన్సారీ సోదరుడు సిగ్భతుల్లా అన్సారీని పార్టీలోకి చేర్చుకోవడం పై ఆమె ఈ విధంగా స్పందించారు. మాఫీయా నేపథ్యం ఉన్నవారికి ఎంపిక చేస్తే.. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయని ఆమె స్పష్టం చేశారు.