రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
1 min read– డయాలసిస్ కేంద్రాన్ని 20 పడకల స్థాయి పెంపుకు కృషి…
– రాయచోటి ఏరియా ఆసుపత్రి పరిశీలనలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి
పల్లెవెలుగువెబ్, రాయచోటి : రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి ఏరియా ఆసుపత్రిని శ్రీకాంత్ రెడ్డితో కలిసి ధనంజయరెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలోని వార్డులు, లేబర్ వార్డును, ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్ కేంద్రాన్ని, వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపీ, ఐపి రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులును ఆదేశించారు. డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 10 పడకలు ఉన్నాయని, రాయచోటి ప్రాంతంలో డయాలసిస్ రోగులు ఎక్కువగా ఉన్నారని, దూర ప్రాంతాలకు వెళ్లలేక రోగులు వ్యయ ప్రయాసలు పడుతున్నారని,20 పడకలకు పెంచేలా కృషిచేయాలనిముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి ని చీఫ్ విప్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఏరియా ఆసుపత్రి అభివృద్దికి కృషిచేస్తామని శ్రీకాంత్ రెడ్డి,ధనంజయ రెడ్డి లు తెలిపారు.
సమస్యలపై ఆరా…
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లు ప్రజా సమస్యలపై ఆరా తీశారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ సమస్యను పరిష్కరించాలని లబ్దిదారులతో కలసి జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి కోరగా అతిత్వరగా సమస్యను పరిష్కరిస్తామని ధనంజయ రెడ్డి హామీ ఇచ్చారు. రాయచోటి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయచోటిలోని కోర్టు భవనాల అభివృద్దికి సహకరించాలని వినతి పత్రం అందచేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు ఫయాజ్ బాషా, దశరథ రామిరెడ్డి, ఫయాజర్ రెహమాన్, జెడ్ పి టి సి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపిపి గడికోట జనార్ధన రెడ్డి, సర్పంచుల సంఘ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్, కురబ కార్పోరేషన్ డైరెక్టర్ రమణ, యదుభూషన్ రెడ్డి, పోల్ రెడ్డి సుబ్బారెడ్డి, ఎంపిటిసి రామచంద్రా రెడ్డి,కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్,కొలిమి ఛాన్ బాషా,మదన మొహన్ రెడ్డి, ఎస్ పి ఎస్ జవీవుల్లా, రిజ్వాన్, అన్నా సలీం, నవరంగ్ నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.