రైలుబోగీలు లీజుకిస్తారు.. కావాలంటే కొనుక్కోవచ్చు !
1 min readపల్లెవెలుగు వెబ్ : రైల్వే శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. గతంలో రైళ్లను అద్దెకిచ్చిన రైల్వే శాఖ.. ప్రస్తుతం రైల్వే బోగీలను అద్దెకిచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. ఎవరైనా సరే రైలు బోగీలను అద్దెకు తీసుకుని.. వారికి ఇష్టం వచ్చిన రీతిలో వాటిని తీర్చిదిద్దుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కావాలంటే శాశ్వతంగానూ కొనుగోలు చేయవచ్చు. బోగీల లీజు పరిమితి కనీసం ఐదేళ్లు. ఆ తర్వాత లీజు కాలం పరిమితి పెంచుకోవచ్చు. రూట్లు, టారిఫ్ నిర్ణయాధికారం అద్దెకు తీసుకున్నవారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వే శాఖ తెలిపింది.