PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లా జడ్పీ ఆవరణలోని మండల పరిషత్ సమావేశ భవనంలో ఆదివారం నిర్వహించిన కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమంకు విశేష స్పందన లభించింది. జిల్లాతో పాటు అనంతపురం, కర్ణాటక, తెలంగాణ ప్రాంతం నుంచి కూడ కురువ కుటుంబసభ్యులు తరలివచ్చారు. వివాహం కొరకు తమ తమ అబ్బాయి, అమ్మాయిల పేర్లు, ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కురువ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పుల్లన్న, జిల్లా అధ్యక్షుడు పెద్దహరివాణం దేవేంద్రప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె శివన్న, రాష్ట్ర ఖాదీ రూరల్ డెవల్పెమెంట్ చైర్మన్ డాక్టర్ భాగ్యమ్మ మాట్లాడుతూ ఈవివాహ పరిచయ వేదిక ద్వారా మంచి సంబంధాలు కుదురుతాయని ఆశీస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు బి.రామకృష్ణ, దివాకర్ , వెంకటేశులు, కల్లె లక్ష్నన్న,పాల సుంకన్న, కన్వీనర్ నాగన్న, పెద్దపాడు పుల్లన్న, కెసీ నాగన్న, తవుడు శ్రీనివాసులు, రఘురాముడు, వెంకటకృష్ణ, జిల్లాలోని అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.


About Author