ప్రశ్నించే గొంతు నొక్కడమే.. రాజన్న రాజ్యమా…!
1 min read– అక్బర్ బాష కుటుంబాన్ని పరామర్శిస్తే… హత్యా నేరమా..?
- ప్రజా సంఘాల, ప్రతిపక్ష నేతలు
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో : రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు నొక్కడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అక్బర్ బాష కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకుడు మహమ్మద్ ఫారూక్ షుబ్లీపై హత్యాయత్నం కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజా సంఘాల నాయకులు. మహ్మద్ ఫారూక్ షుబ్లీపై హత్యాయత్నం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం టీడీపీ ఇన్చార్జ్ వీఎస్ అమీర్‌బాబు నేతృత్వంలో ప్రజా, ప్రతిపక్షాలతో కలిసి కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పరామర్శకు వెళితే మర్డర్ కేసు పెట్టడం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని విరుచుకుపడ్డారు. వైకాపా నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధపడిన అక్బర్ బాషాని పరామర్శించడానికి వెళ్లిన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అక్బర్ బాషాని వేధించిన వైకాపా నాయకులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల, ముస్లిం మత పెద్దలైన సలావుద్దీన్, బాబు భాయి, మౌలానా మొయిద్దీన్, దస్తగిరి, జాకీర్ మౌలానా, ఐజాఖ్ మౌలీ సాబ్, నాసర్, ఎండి అలీ ఖాన్, అన్వర్ హుస్సేన్, తస్లీమా, ఖాదర్ బాష, ప్రతిపక్ష నేతలు గుజ్జల ఈశ్వరయ్య, సత్తార్, సుబ్బారాయుడు, దేవా మరియు టీడీపీ నేతలు నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జయకుమార్, కడప పార్లమెంట్ అధికార ప్రతినిథులు అక్బర్, బాలదాసు, కడప పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షుడు అబిద్ పాషా, జిలానీ బాష, వరప్రసాద్, నాసర్ అలీ, జయశేఖర్, శ్రీనివాసులు, సుబ్బయ్య, కొమ్మలపాటి, నూర్, జియావుద్దీన్ పాల్గొన్నారు.