‘అమీలియో’, శ్రీ అనఘదత్త జ్ఞానభోధనసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ దగ్గర గల సూర్యదేవాలయంలో అమీలియో హాస్పిటల్స్ నేతృత్వంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు లక్ష్మీ ప్రసాద్ చాపె, యూనీస్ (జనరల్ మెడిసిన్), యశోద (గైనకాలజిస్ట్), వీరేంద్ర (ఆప్తోల్మాలజీ) రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కంటిచూపు , షుగర్ , బీపీ , ఈసీజీ తదితర పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం కరోనా నేపథ్యంలో ఉచిత మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అనఘదత్త జ్ణానభోధసభ ట్రస్ట్ సభ్యులు శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రజల దగ్గరకు వచ్చి ఉచితంగా వైద్య సేవలను అందజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవలను అందిస్తున్న వైద్యులు లక్ష్మీ ప్రసాద్ చాపె ప్రశంసనీయులని వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆ తరువాత అమీలియో హాస్పిటల్ ఎండీ లక్ష్మి ప్రసాద్ చాపె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తామని, గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత వైద్యశిబిరం కోసం సెల్.నం. 9951923623 సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో అమిలియో హాస్పిటల్స్ యండీ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ చాపె ను సూర్యదేవాలయం ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ శివరామకృష్ణ గారు రు, పూజారులు శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు.