జొమాటో వ్యాపారం బంద్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : జొమాటో సంస్థ తన కిరాణా సరకుల వ్యాపారానికి గుడ్ బై చెబుతోంది. ఈనెల 17 నుంచి ఈ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్డర్ పెట్టిన 45 నిమిషాల్లో వినియోగదారుడికి సరుకులు అందించే హామీతో ఈ సంవత్సరం జులైలో కంపెనీ ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించింది. అయితే సకాలంలో సరుకులు అందించలేకపోవడంతో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వ్యాపారానికి గుడ్ బై చెప్పడం మేలని జొమాటో భావిస్తున్నట్టు సమాచారం.