పెట్రోల్ బంకుల్లో మోసాలను ఇలా అరికట్టండి !
1 min readపల్లె వెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. వాటితో పాటే మోసాలు కూడ పెరిగాయి. ఎటు చూసినా వినియోగదారుడి జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. పెట్రోల్ కొట్టించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులను అధికారులు హెచ్చరిస్తున్నారు.
- పెట్రోల్ నాణ్యత పై సందేహం వస్తే వెంటనే ఫిల్టర్ తో చెక్ చేయమని డిమాండ్ చేయాలి.
-ప్రతి పెట్రోల్ బంక్ లో కూడ ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచాలి. ఫిల్టర్ పేపర్ పై ఒక్క చుక్క పెట్రోల్ వేసినా అది పూర్తీగా ఆరిపోయి.. మరక కూడ కనిపించదు. అలా కనిపించకపోతే అది ఓరిజినల్ అని అర్థం. మరక కనిపిస్తే కల్తీ అయి ఉంటుందని అర్థం. - వినియోగదారులకు సందేహం వస్తే 5 లీటర్ల క్యాన్ లో పెట్రోల్ నింపి పరీక్ష చేయాలి.
- వినియోగదారులు ఫిర్యాదు చేయాలనిపిస్తే అధికారుల నెంబర్లు బంకుల్లో ప్రదర్శించాలి.
- పెట్రోల్ బంకుల్లో మోసాలపై ఈ నెంబర్ల ఫిర్యాదు చేయవచ్చు. – 18004254202.
- ఈ వెబ్ సైట్ ద్వార కూడ ఫిర్యాదు చేయవచ్చు. – clm&[email protected]