పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని టిడిపి ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ : రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో పత్తికొండలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానలు అవలంభిస్తోందని, అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఓ వైపు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయన్నారు.
అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే అనాలోచిత నిర్ణయాలతోనే… వైసీపీ ప్రభుత్వం పతనమవుతుందన్నారు. ఆ తరువాత టిడిపి కార్యాలయం నుండి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీగా వచ్చారు . అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద కూరగాయలు రోడ్డుపై పారబోసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పోలీసుల జోక్యంతో ధర్నా కార్యక్రమం విరమించారు.