ఒకప్పటి ఖైదీలే.. ఇప్పటి జైలు అధికారులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : పుల్-ఇ-ఛర్కీ. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగర శివారులోని జైలు ఇది. ఒకప్పుడు తాలిబన్లతో ఈ జైలు కిక్కిరిసిపోయింది. ఈ జైలు ఆప్ఘన్ లోని ప్రధాన జైలు. 5 వేల సామర్థ్యం ఉన్న ఈ జైలులో 10 వేల మంది దాక ఖైదీలు ఉంటారు. ఆప్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లాక.. ఇప్పుడు ఈ జైలు సాధారణ పౌరులతో, తాలిబన్ వ్యతిరేకులతో నిండిపోతోంది. తాలిబన్లు ఆక్రమించుకోగానే.. జైలులో ఉన్న తాలిబన్ ఖైదీలను వదిలిపెట్టారు. ఈ జైలును కూడ తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఒకప్పటి ఖైదీలే ప్రస్తుత అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.