NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలు ప్రతి పేదకుటుంబానికి వర్తింపజేయాలి

1 min read

– మండల ప్రత్యేక అధికారి పి.రాజశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చాలని మండల ప్రత్యేక అధికారి పి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు పై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలుఅమలులో ఏ శాఖ వారు వెనక బడి ఉన్నారో వారు పురోగతి సాధించడానికి ప్రత్యేకంగా మండల స్పెషల్ అఫిసర్ గారు తగు సూచనలు చేశారు. అదేవిధంగా మండలంలో వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే ,సచివాలయంలో సర్వీసులను పెంచుట,ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సినేషన్, డిజిటల్ అక్నోలెడ్జి మెంట్,బయోమెట్రిక్ అటెండెన్స్ తదితర అంశాలపై సమీక్షలు చేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి.సురేష్ బాబు, తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి, యండపల్లి PHC డాక్టరు సునీల్ కుమార్ నాయక్ ,డిప్యూటీ తహశీల్దార్ నరసింహకుమార్, RWS AE గారు,PR AE ,,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Author