వయోవృద్ధులు ఫిజియోథెరపీ సేవలు సద్వినియోగం చేసుకోండి
1 min read– జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు వెల్ఫేర్) ఎం కె వి శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యాధునిక పరికరాలతో ఫిజియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి. శ్రీనివాసులు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఫిజియోథెరపీ వార్డును జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి. శ్రీనివాసులు సందర్శించి ఆధునిక పరికరాలను పరిశీలించి ఫిజియోథెరపీ డాక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు మాట్లాడుతూ…ఫిజియోథెరపీ కోసం వచ్చిన వయోవృద్ధుల పట్ల మంచిగా పలకరిస్తూ వైద్యసేవలు అందించాలని ఫిజియోథెరపీ డాక్టర్లకు జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ వార్డు లో ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, ఓపి సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ శివ బాల, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ పి. విజయ, ఫిజియోథెరపీ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.