PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు.. పరీక్ష విధానం.. తెలుసుకోండిలా..

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : న‌్యూ ఇండియా అస్యూరెన్స్
ఉద్యోగం : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త : డిగ్రీ
జీతం : పేర్కొన‌లేదు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప‌రీక్షా విధానం :

  • ఆన్‌లైన్‌ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–30 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ–35 మార్కులకు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 15రెట్ల మందిని మెయిన్‌కు అనుమతిస్తారు.
    మెయిన్‌ పరీక్ష
  • ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌.. రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 200 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. ఈ రెండు టెస్టులు కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి.
  • మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌–50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌–50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌–50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్‌ తరహ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్‌ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
  • డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్‌ రైటింగ్‌ పది మార్కులకు, ఎస్సె 20 మార్కులకు ఉంటాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.
    ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది : 21-9-2021
    ప్రిలిమ‌న‌రీ ప‌రీక్ష తేది : అక్టోబ‌ర్ , 2021
    మెయిన్ ప‌రీక్ష తేది : న‌వంబ‌ర్, 2021

అధికారిక వెబ్ సైట్ : www.newindia.co.in/portal

About Author