శ్రీశైలం డ్యాం.. రెండు గేట్లు ఎత్తివేత
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల తుంగభద్ర డ్యాం లో నీటి నిల్వ గరిష్టస్థాయిలో నిల్వ ఉండటంతో దిగువ ప్రాంతాలైన జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు 10 అడుగుల మేర రెండు గేట్లను పైకి ఎత్తి 1,70,546 క్యూసెక్యుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 82010 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో అధికారులు గేట్లను పైకెత్తారు. గురువారం ఉదయం 6 గంటలకు డ్యాంలో 884 అడుగులు, 212 టీఎంసీల నీరు నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మొత్తం 1,70,546 క్యూసెక్కుల నీటిని సాగర్ కి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయం గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి.