అమానుషం.. కాలు, చేయి నరికేసిన భర్త
1 min readపల్లెవెలుగు వెబ్: కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తండాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య కాలు, చేయి నరికేశాడో భర్త. ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మకు పాతికేళ్ల కింద వివాహం అయింది. ఇటీవల అనుమానంతో భార్యను వేధించేవాడు. భార్య, భర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో నాగానాయక్ తన భార్య ఈశ్వరమ్మ కాలు, చేయి విచక్షణారహితంగా కొడవలితో నరకడంతో కాలు, చేయి తెగిపడ్డాయి. స్థానికులు ఆమెను వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.