శ్రీశైలం డ్యాం 5గేట్లు ఎత్తివేత..!
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీశైలం డ్యాం అధికారులు గురువారం రాత్రి 5క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా వదరనీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతంలోని జూరాల జలాశయం, సుంకేసుల బ్యారేజి నుంచి మొత్తం 2,42,373క్యూసెక్యుల వరదనీరు శ్రీశైలజలాశయానికి చేరుతోంది. దీంతో డ్యాం అధికారులు
5గేట్లు ఎత్తి 1,39,915క్యూసెక్కులు, రెండు విద్యుత్కేంద్రాల నుంచి 58,848క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,42,373క్యూసెక్కుల వరదనీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7.30గంటల సమయానికి డ్యాం వద్ద నీటిమట్టం 884.80అడుగులకు చేరగా జలాశయంలో నీటినిల్వసామర్థ్యం 214.3637టీఎంసీలుగా నమోదయింది.