మమత బెనర్జీ మీద దాడి
1 min readపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మీద దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అనంతరం రేయపార ప్రాంతంలోని ఓ గుడి వద్ద దర్శనానికి వెళ్లింది మమత బెనర్జీ. అయితే… దర్శనం అనంతరం కారు ఎక్కుతుండగా.. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు తోసేశారు. దీంతో ఆమె కాలికి తీవ్రగాయమైంది. ఇది కుట్రేనని దీదీ ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు తనను అంతమెందించేందుకు కుట్ర చేశారని తెలిపారు. కాలి గాయంతో పాటు, అప్పటికే మమత బెనర్జీకి నడుం నొప్పి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తృణమూల్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె కోల్కత్తా లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల కథనం ప్రకారం ఆమె కాలి చీలమండ వద్ద ఎముక తీవ్రంగా గాయపడిందని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే.. మమత మీద దాడి నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన మాటల దాడి కొననసాగుతోంది. ఇది డ్రామా అని బీజేపీ అభివర్ణించింది. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం… బీజేపీ ను విమర్శిస్తోంది. పోలింగ్ రోజున బెంగాల్ ప్రజల పవర్ ఏంటో చూస్తారంటూ మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు.