మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి అప్రజాస్వామ్యకం!
1 min read– కడప జిల్లా తెదేపా ఇన్‌ఛార్ట్ విఎస్.అమీర్‌బాబు
= భౌతిక దాడులతో ప్రజలకు ఏం సంకేతం ఇస్తన్నట్లు
= రాష్ట్రంలో వైసీపీ ఆటవికత రాజ్యమేలుతోంది
= జగన్ కోసమే ఎమ్మ్యెల్యే జోగిరమేష్ బరితెంపు
పల్లెవెలుగువెబ్ కడప : ఉండవెల్లిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటి వద్ద స్థానిక ఎమ్మ్యెల్యే జోగిరమేష్ తన అనుచరగణంతో దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కడప అసెంబ్లీ టిడిపి ఇన్ఛార్జ్ విఎస్.అమీర్‌బాబు అన్నారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇండిపై దాడి అప్రజాస్వామ్యకమని, భౌతిక దాడులతో సీఎం జగన్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ఆటవీక పాలన రాజ్యమేలుతోందని, సీఎం జగన్ మెప్పు కోసమే ఎమ్మ్యెల్యే జోగిరమేష్ చంద్రబాబు ఇంటి వద్ద బీభత్సం సృష్టించారని ఆరోపించారు. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన జెడ్‌కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుకే రక్షణ కొరవడితే.. ఇక సామాన్య ప్రజల మాటేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిరసన చేపడితే టిడిపి నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తారు. జోగిరమేష్ సోషల్‌మీడియాలో చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ప్రకటిస్తే డీజీపీ ఎందుకు ముందస్తు అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. నారాలోకేష్‌ను నరసరావుపేటకు వెళ్లకుండా ఆపిన పోలీసులు జోగిరమేష్‌కు చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ఎలా అనుమతించారన్నారు. అల్లరిమూకలతో అలజడి సృష్ఠించిన వైసీపీ నేత జోగిరమేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర అధ్యక్షులు సానపురెడ్డి శివకొండారెడ్డి, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, కార్యదర్శి మాసా కోదండరామ్, 15వ డివిజన్ ఇన్ఛార్జ్ కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.