చిన్నపిల్లల బ్లూ ఫిల్మ్స్.. చూస్తే డైరెక్టుగా జైలుకే !
1 min readపల్లెవెలుగు వెబ్ : చిన్నారులు, మైనర్ల పై అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన బ్లూ ఫిల్మ్స్ చూస్తే నేరుగా జైలుకు పంపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి చిత్రాలు చూస్తున్నవారి ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపుతోంది. దేశవ్యాప్తంగా 1095 మందిని ఈ ఏడాది అరెస్టు చేశారు. ఈ తరహా వెబ్ సైట్లు చూస్తున్నవారిని జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తిస్తుంది. ఈ సంస్థ సీసామ్ అనే అమెరికా సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి చిత్రాలు చూస్తు తొలిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు, పది లక్షల జరిమానా విధిస్తున్నారు. రెండోసారి దొరికితే ఏడేళ్ల పాటు జైల్లో ఉండాలి. పది లక్షల జరిమానా విధిస్తారు.