‘ పరిషత్’ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు, నందికొట్కూరు, పగిడ్యాల మండలలోని 33 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఈ నెల 19న ఓట్ల లెక్కింపునకు నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జలానీ సామూన్ తెలిపారు. శనివారం నందికొట్కూరు పట్టణంలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కోసం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. ఎంపీటీసీ సెగ్మెంట్‌కు ఒక టేబుల్ ఏర్పాటు చేశామని, కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించాకే అనుమతిస్తామన్నారు.
కౌంటింగ్ కేంద్రము వద్ద తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్య తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద జనరేటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పిఆర్ డిఈ రవీంద్రా రెడ్డి, పశుసంవర్ధక శాఖ ఏడీ వర ప్రసాద్, ఎంపిడిఓ లు సుబ్రమణ్యం శర్మ, గౌరీ దేవి, రెవిన్యూ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.