ఎమ్మెల్యే జోగిరమేష్, అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలి
1 min read– టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రాజు యాదవ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై గత శుక్రవారం ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు ఎంవి ఎన్ రాజు యాదవ్. శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే జోగిరమేష్, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రనాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, తన అనుచరులు, రౌడీ మూకలతో కలిసి దాడి చేశారని, ఇదేమని ప్రశ్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పూనుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన జోగిరమేష్, తన అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఐటీడీపీ పార్లమెంట్ ఇంచార్జి తిలక్ గట్టు , ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు థరూర్ జేమ్స్ , టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు హనుమంత్ రావు చౌదరి, లీగల్ సెల్ ప్రసాద్, తెలుగు యువత ఉపాధ్యక్షులు పేరుపోగు రాజు , 33 వార్డ్ ఇంచార్జి ఎన్ వి గోపి, పాణ్యం సోషల్ మీడియా సభ్యులు వక్కల గోపి కృష్ణ , వీరేష్ పాల్గొన్నారు.