పంజాబ్ సీఎంగా చరణ్ జిత్ సింగ్
1 min read
పల్లెవెలుగు వెబ్ : పంజాబ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త సీఎం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. కెప్టన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ లో రాజకీయ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎం గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ ను ఎన్నుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీష్ రావత్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కొత్త సీఎల్పీ నాయకుడు త్వరలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలవనున్నారు. పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ చివర్లో కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ ను ఎంపిక చేసింది.