కుప్పం క్లీన్ స్వీప్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : పరిషత్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలు వైకాపా కైవసం చేసుకుంది. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఏం వివరణ ఇస్తారు అని ప్రశ్నించారు. కుప్పంలో 2014లో చంద్రబాబుకు 58 వేల వరకు మెజార్టీ వస్తే.. దాన్ని 2019లో 27 వేలకు తగ్గించాం. 62,297 ఓట్లు కుప్పం ప్రజలు మాకు ఇచ్చారు. తెదేపా వాళ్లు ఇక శుభం కార్డు వేసుకోవాల్సిందే
అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. తాము పోటీలో లేమని తెదేపా వాళ్లు అంటే.. అంతకంటే హాస్యాస్పదం లేదని ఆయన అన్నారు. తెదేపా వారు పోటీ చేసి.. బీపారాలు ఇచ్చి.. ప్రచారం చేశారని, ఆ వీడియోలు అవసరమైతే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తామని చెప్పారు. పెట్టిన ఎన్నికల్లో పోటీ చేయకుండా.. మళ్లీ ఎన్నికలు పెట్టాలంటారని ఎద్దేవా చేశారు. కుప్పంలో తెదేపా పరిస్థితి చూస్తే చాలని, అంతకంటే సిగ్గుపోయే పరిస్థితి ఇంకొకటి ఉంటుందా ? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.