NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త‌ల్లిదండ్రుల పై కేసుపెట్టిన ప్రముఖ హీరో !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ త‌మిళ హీరో విజ‌య్ సొంత త‌ల్లిదండ్రుల‌పై కేసు పెట్టారు. త‌న అనుమ‌తి లేకుండా త‌న పేరు వాడుతున్నారంటూ త‌ల్లిదండ్రుల‌తో పాటు మ‌రో 11 మంది పై ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం విజ‌య్ మ‌క్కల్ ఇయ్యకమ్ పేరుతో ఆయ‌న తండ్రి చంద్రశేఖ‌ర్ పార్టీ పెట్టారు. పార్టీ ప్ర‌ధాన కార్యద‌ర్శిగా, కోశాధికారిగా విజ‌య్ త‌ల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో త‌న‌కు సంబంధం లేద‌ని గ‌తంలో విజ‌య్ ప్రక‌టించారు. కానీ విజయ్ త‌ల్లిదండ్రులు పార్టీ పేరుతో కార్యక‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న అనుమ‌తి లేకుండా త‌న పేరు వాడుకుంటున్నార‌ని విజ‌య్ కేసు పెట్టారు. ఈ ఘ‌ట‌న త‌మిళ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

About Author