NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

29 మంది కౌంటింగ్ ఏజెంట్ల‌కు కరోన !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌రోసారి క‌రోన క‌ల‌క‌లం రేగింది. విశాఖ జిల్లాలో 29 మంది కౌంటింగ్ ఏజెంట్లు క‌రోన బారిన‌ప‌డ్డారు. ఆదివారం జ‌ర‌గ‌నున్న ప్రాదేశిక ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో పాల్గొన‌నున్న 29 మంది కౌంటింగ్ ఏజెంట్లకు క‌రోన పాజిటివ్ వ‌చ్చింది. 90 మంది కౌంటింగ్ ఏజెంట్లకు క‌రోన ప‌రీక్షలు నిర్వహించారు. క‌రోన వ‌చ్చిన వారిని వెంట‌నే ఐసోలేట్ చేయాల‌ని విశాఖ జేసీ ఆదేశించారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే కౌంటింగ్ ఏజెంట్లుగా తీసుకుంటామ‌ని అధికారులు స్పష్టం చేశారు. ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వ‌చ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమ‌తిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

About Author