PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచం నెత్తిన మ‌రో చైనా బాంబు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన వైర‌స్ తో ప్రపంచాన్ని అల్లక‌ల్లోలం చేసిన చైనా.. మ‌రో సంక్షోభంలోకి నెట్టేందుకు సిద్ధమైంది. చైనాకు చెందిన రియ‌ల్ ఎస్టేట్ దిగ్గజం ఎవ‌ర్ గ్రాండే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాదాపు 300 బిలియ‌న్ డాల‌ర్లు చెల్లింపులు చేయాల్సి ఉంద‌ని ప్రక‌టించింది. దీంతో దివాళ తీసేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ సంస్థ వ్యాపారం చైనా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో 2 శాతం దాక ఉంటుంది. ఎవ‌ర్ గ్రాండే 15 ల‌క్షల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. ప్రజ‌ల‌తో డ‌బ్బు కూడ సేక‌రించింది. కానీ ఇప్పుడు ఉద్యోగుల‌కు జీతాలు కూడ ఇవ్వలేని స్థితి నెల‌కొంది. ఎవ‌ర్ గ్రాండే క‌నుక దివాళ తీస్తే ఆ ప్రభావం ప్రపంచ‌వ్యాప్తంగా ప‌డుతుంది. చైనా రియ‌ల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే ప్రజ‌ల ఆదాయాలు కూడ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. ఫ‌లితంగా కొనుగోలు శ‌క్తి త‌గ్గుతుంది. యూరప్ దేశాల ల‌గ్జరీ వ‌స్తువుల‌కు చైనా అతిపెద్ద మార్కెట్. 50 శాతం ఆదాయం చైనా నుంచే వ‌స్తుంది. భార‌త్ నుంచి చైనాకు స్టీల్, ముడి ఇనుము ఎగుమ‌తి అవుతుంది. ఫ‌లితంగా భార‌త్ నుంచి చైనాకు ఎగుమ‌తులు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. చైనా క‌రెన్సీ విలువ త‌గ్గితే అంత‌ర్జాతీయ మార్కెట్లోకి చైనా వస్తువులు విచ్చల‌విడిగా స‌ర‌ఫ‌రా అవుతాయి. అయితే… ఈ సంస్థను ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించే ఎలాంటి ప్రణాళిక‌ను చైనా ప్రభుత్వం ప్రక‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం .

About Author