పితరులకు ప్రియం.. మహాలయం..
1 min read– 21 నుంచి వచ్చే 6 వరకు మహాలయ పక్షాలు
– కళ్లే. ప్రతాప్ శర్మ, కృష్ణ యజుర్వేందం, తిరుమల తిరుపతి వేదపండింతులు
పల్లెవెలుగు వెబ్: భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం, కృష్ణపక్షం పితృపదము.. దాన్నే మహాలయ పక్షం అంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 21 నుంచి భాద్రపద పాడ్యమి నుంచి అక్టోబరు 6వ తేదీ అమావాస్య వరకు మహాలయ పక్షము అంటారు . ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. ఈ 15రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధవిధులను నిర్వహించాలి అలాకుదరని పక్షమున పితృదేవతలు ఏతిధిలో మరణిస్తే ఆరోజు నిర్వహించాలి .
మహాలయ: మహాన్ – అత్యంతికోలయో యత్ర-మహాలయః ఆ సమంతా త్లయం ఆలయం అని మహాలయాన్ని గురించి రెండు వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి. మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించి న రోజు. మరో అర్థం లో ప్రళయ కాలం వరకు నిలిచి వుండి అప్పుడు లభ్యమయ్యేవి.
మహాలయమంటే : మహాన్ అలయః, మహాన్‌లయః. మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము,
పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.
పితృగణాలు మొత్తం ఏడుగురు.
- వైరాజులు 2. అగ్ని ష్పావత్తులు 3.బర్విషదులు 4. హవిష్మంతులు 5. ఆజ్యపులు 6. సోమపులు 7. అంగిరసులు.
మహాలయ శ్రాద్ధం లో వచ్ఛే విశ్వే దేవతలకు “ధురి విలోచనులు” అని పేరు.
మన భౌతిక శరీరం మొదటి ది – కనిపిస్తుంది. రెండవది- ప్రేత శరీరము, మూడవది-ఆత్మ సూక్ష్మ శరీరం.
వీటి ప్రతీకలు వసు (3), రుద్ర(11), ఆదిత్య(12) రూపాలు.
ఈ మూడు రూపాల్లో నుంచి పితృ లకు 1. అగ్ని ముఖం గా 2.బ్రాహ్మ ణ భోజనంగా 3. పిండి ప్రదానం గా 4.ఉపవాసంగా శ్రాద్ధం ఏ ర్పాటు చేసుకో వచ్చు.
తండ్రి మరణించిన వారే మహా లయపక్షం చేయడానికి అర్హులు.
మహాలయం…. లో కొన్ని ప్రత్యేకం గా సూచించారు. అవి
☀సన్యాసులకు … ద్వాదశినాడు☀
💥బలవన్మరణం(suicide), విషప్రయోగం లతో మరణించిన వారికి…. చతుర్దశి నాడు
☀భర్త జీవించి ఉండగా మరణించిన సువాసినీ. స్త్రీ … నవమి నాడు💥
అయితే.. కూతురు తన కొడుకు చేత తన తల్లీ దండ్రులకు శ్రాద్ధం చేయదలచి నప్పుడు… ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేయాలి.
💥తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి.
💢తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన పూర్తి గా తప్పక పితృకర్మలు చేయాలి.
ఇతర కారణముల వలన ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య అనగా 06/10/2021 బుధవారం అయినా చేసి తీరాలి.
{ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు.}
తండ్రి చనిపోయిన రోజున(తిధి), మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు.
ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, ధర్మసింధూ,నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.