PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్ట్రేలియా టూర్​లో మహిళా టీమిండియా సారథి మిథాలిరాజ్​ సరికొత్త రికార్డులు!

1 min read

= వన్డేల్లో వరుసగా 5హాఫ్​ సెంచరీలు, = 20వేల పరుగుల మైలురాయి చేరిన తొలి మహిళా క్రికెటర్​గా రికార్డు.
పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: మహిళా టీం ఇండియా క్రికెట్​ సారథి మిథాలిరాజ్ 38 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోంది. సుదీర్ఘ కెరీర్​లో టీమిండియా తరుపున సోలో పర్ఫామెన్స్ ఇస్తూ, రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి వన్డేలో 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడినా.. కెప్టెన్ మిథాలీరాజ్​ ఆట తీరు ప్రశంసలందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ 8, స్మృతి మంధాన 16 పరుగులు చేసి నిరాశపరిచారు. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా యషికా భాటియాతో కలిసిన మిథాలి మూడో వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 51 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు చేసిన యషికా అవుట్ కాగా తర్వాత 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేసి మిథాలిరాజ్​ పెవిలియన్ చేరింది దీంతో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయి. వన్డేల్లో వరుసగా ఐదు హాఫ్​ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌వుమెన్‌గా సరికొత్త రికార్డు సృష్ఠించింది. ఇటీవల సౌతాఫ్రికాతో లక్నోలో జరగిన వన్డేలో 79 పరుగులతో నాటౌట్‌గా నిలువగా ఇంగ్లాండ్ సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ వరుస అర్ధశతకాలు చేసింది. వన్డేల్లో మిథాలీరాజ్‌ 59వ హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

About Author