జాతీయ రహదారి విస్తరణపై ముస్లిం మతపెద్దలతో చర్చించిన ఛీఫ్ విప్
1 min readపల్లెవెలుగువెబ్, రాయచోటి : రాయచోటి పట్టణంలో జాతీయ రహదారి విస్తరణపై ముస్లిం మతపెద్దలతో మంగళవారం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి మార్గాలను చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మతవిశ్వాసలకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తామని మతపెద్దలకు హామీ ఇచ్చారు. మతపెద్దలు మాట్లాడుతూ 150 సంవత్సరాలుగా దర్గాలో సమాధులు ఉన్నాయని, ఈ విషయంపై న్యాయం చేయాలని శ్రీకాంత్ రెడ్డి ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,ఆర్ అండ్ బి అధికారులు, తహిశీల్ధార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, డి టి నరసింహ కుమార్, ఆర్ ఐ బాష,ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.