ఏపీ సీఎంఆర్ఎఫ్ అవినీతిలో ఏసీబీ విచారణ – 4గురి అరెస్టు!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నిర్వహణ విభాగంలో జరుగుతోన్న అవినీతిపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఈమేరకు బుధవారం నలుగురు వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సచివాలయ ఉద్యోగులు ఇద్దరు, మరో ఇద్దరు ప్రయివేటు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పేద ప్రజల ప్రయోజనార్థం సీఎం రీలీఫ్ ఫండ్ పథకాన్ని ఏపీ సర్కార్ 2014నుంచి అమలు చేస్తోంది. అయితే గతకొంతకాలంగా సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వనియోగం అవుతున్నాయన్న కోణంలో ఏసీబీ కొద్దిరోజులుగా అంతర్గత విచారణ చేపడుతోంది. ఈక్రమంలో ఏపీ సచివాలయ కార్యాలయంలో నలుగురు వ్యక్తులు సదరు పథకం అమలులో అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈమేరకు మున్ముందు సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ ఏమేర ఉంటుందన్నది తేలాల్సి ఉంది.